16200 వద్ద ముగిసిన నిఫ్టి
రోజంతా నష్టాల్లో కొనసాగిన నిఫ్టి… మధ్యలో కాస్త పెరిగే ప్రయత్నం చేసినా.. అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండటంతో 16,201 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 276 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 1016 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ మళ్ళీ 54500 స్థాయి దిగువకు వచ్చేసింది.అలాగే బ్యాంక్ నిఫ్టి కూడా 34500 దిగువకు వచ్చేసింది. నిజానికి ఇవాళ భారీగా క్షీణించింది నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఫైనాన్షియల్స్. ఇవి 1.7 శాతంపైగా నష్టపోయాయి. ఇక నిఫ్టి కూడా 1.68 శాతం నష్టపోయింది. అయితే నిఫ్టి మిడ్ క్యాప్ మాత్రం 0.8 శాతం లాభానికి పరిమితమైంది. నిఫ్టిలో 37 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్ నిఫ్టి పతనంలో కీలక పాత్ర పోషించింది. ఇక షేర్ల విషయానికొస్తే గ్రాసిం నిఫ్టి టాప్ గెయినర్‌గా కాగా… అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక లూజర్స్‌లో బజాజ్ ఫైనాన్స్ ముందుంది. ఈ షేర్ ఇవాళ 4 శాతంపైగా నష్టపోయింది. కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సి కూడా టాప్ లూజర్స్‌లో ఉంది.