24000పైన ముగిసిన నిఫ్టి

దాదాపు అన్ని రంగాల సూచీల నుంచి అండ లభించడంతో ఇవాళ నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి ఆకర్షణీయ లాభాలతో కొనసాగిన నిఫ్టి 24125 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 273 పాయింట్ల లాభంతో ముగిసింది. నిజానికి నిఫ్టి ఇవాళ 24189 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అక్కడి నుంచి ఒత్తిడి కన్పించినా… అది కేవలం నామమాత్రంగానే మిగిలింది. సూచీలో నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఐటీ, నిఫ్టి రియాల్టితో పాటు అనేక ప్రధాన సూచీలు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇవాళ నిఫ్టి 3014 షేర్లు ట్రేడవగా, వీటిలో 2251 షేర్లు లాభాలతో ముగిశాయి. కేవలం 683 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇవాళ 93షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకగ, 166 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో ముగిశాయి. నిఫ్టిలో టెక్ మహీంద్రా టాప్ గెయినర్‌గా రోజంతా కొనసాగింది. తరవాతి స్థానాల్లో ట్రెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్ ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో అదానీ పోర్ట్స్ ముందుంది.హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ఏషియన్ పెయింట్స్ షేర్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.