For Money

Business News

25,000 పైన ముగిసిన నిఫ్టి

ఉదయం కొద్దిసేపు కంగారు పెట్టించినా… రోజంతా నిఫ్టి గ్రీన్లో కొనసాగింది. ఉదయం 24,896 పాయింట్ల కనిష్ఠ స్థాయి తాకిన తరవాత… నిఫ్టి క్రమంగా బలపడుతూ వచ్చింది. మిడ్‌సెషన్‌లో ఏకంగా 25,130 పాయింట్లను తాకింది. సెసన్‌ చివర్లో కొద్ది పాటి లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి 25,050 వద్ద ముగిసింది. ఇటీవల కరెక్షన్‌కు లోనైన పలు షేర్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా వపర్‌ సెక్టార్‌లో ఈ ట్రెండ్‌ చాలా స్పష్టంగా కన్పించింది. ప్రధాన రంగాలకు చెందిన సూచీలన్నీ ఇవాళ ఆకర్షణీయ లాభాలు గడించాయి. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు బాగా రాణించాయి. అందులో మిడ్‌ క్యాప్ సూచీ 1.39 శాతం లాభపడటం విశేషం. ఇటీవల బాగా తగ్గిన ఐటీ రంగంలోని మిడ్‌ క్యాప్‌ షేర్లు ఇవాళ భాగా రికవరీ అయ్యాయి. పలు కౌంటర్లలో షార్ట్‌ కవరింగ్‌ కన్పించింది. కోఫోర్జ్‌, ఇండియన్ హోటల్స్‌ షేర్లు నాలుగు శాతంపైగా లాభపడ్డాయి. ఇవాళ కూడా ఐటీ, ఫార్మా రంగానికి పలు కౌంటర్లు బాగా లబ్ది పొందాయి. బ్యాంకు షేర్ల నుంచి మాత్రం ఒక మోస్తరు స్థాయి మద్దతు లభించింది. నిఫ్టి టాప్‌గెయినర్స్‌లో ఇవాళ దివీస్‌ ల్యాబ్‌ టాప్‌లో నిలిచింది. ఈ షేర్‌ 5 శాతంపైగా లాభపడింది. ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ ట్రీ, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో వంటి షేర్లు ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో నిలిచాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో నిలిచిన షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ నిలిచాయి.

Leave a Reply