For Money

Business News

రోజంతా బలంగా…

మార్కెట్‌ ఇవాళ రోజంతా పటిష్ఠంగా సాగింది. ఉదయం 24614ని తాకిన నిఫ్టి.. అక్కడి నుంచి కోలుకుని మిడ్‌ సెషన్‌ సమయానికల్లా 24909 పాయింట్ల స్థాయిని అందుకుంది. క్లోజింగ్‌లో 243 పాయింట్ల లాభంతో 24853 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 763 పాయింట్లు లాభపడింది. ఫార్మా మినహా మిగిలిన ప్రధాన రంగాల సూచీలన్నీ గ్రీన్లో ముగిశాయి. నిఫ్టి ఎఫ్‌ఎంసీజీ ఇవాళ 1.63 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి పైనాన్సియల్స్‌, నిఫ్టి బ్యాంక్‌ కూడా ఒక శాతం దాకా లాభపడ్డాయి. ఐటీ కూడా ఇవాళ అదే స్థాయిలో పెరిగింది. ఇక నిఫ్టి మిడ్‌ బ్యాంక్‌, స్మాల్‌ క్యాప్‌ 100 సూచీ కూడా 0.80 శాతం పెరిగాయి. ఇవాళ నిఫ్టిలో 2947 షేర్లు ట్రేడవగా, 1731 షేర్లు గ్రీన్‌లో, 1132 షేర్లు రెడ్‌లో ముగిశాయి. అప్పర్‌ సర్క్యూట్‌లో 93 షేర్లు క్లోజ్‌ కాగా, లోయర్‌ సర్క్యూట్‌లో ముగిసిన షేర్ల సంఖ్య 48. మొన్నటి దాకా బాగా ఒత్తిడికి లోనైన షేర్లలో ఇవాళ రిలీఫ్‌ ర్యాలీ వచ్చింది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌ అయిన ఎటర్నల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు మూడు శాతంపైగా లాభంతో ముగిశాయి.తరువాతి స్థానాల్లో జియో ఫైనాన్షియల్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఐటీసీ ఉన్నాయి. ఇవాళ నిఫ్టిలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. వీటిలో సన్‌ ఫార్మా ఒక్కటే 1.7 శాతం నష్టపోగా, మిగిలిన గ్రాసిం, భారతీ ఎయిర్‌టెల్‌, బీఈఎల్‌ షేర్లు నామ మాత్రపు నష్టంతో క్లోజయ్యాయి.