For Money

Business News

చివరల్లో షాకిచ్చినా…

కేవలం పడి నిమిషాల్లో మార్కెట్‌ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. ఉదయం నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చిన మార్కెట్‌ రికార్డు స్థాయిలో 24857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. 2.45 నిమిషాల వరకు బాగానే ఉంది. కేవలం పది నిమిషాల్లో నిఫ్టి దాదాపు మూడు వందల పాయింట్లు కోల్పోవడంతో ఇన్వెస్టర్లు షాక్‌ తిన్నారు. 24,500 ప్రాంతానికి పడిపోవడంతో అవాక్కయ్యారు. ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టి భారీగా నష్టపోయింది. ఆ తరవాత పది నిమిషాల్లో నిఫ్టి తేరుకుంది. మరో 200 పాయింట్లు తేరుకుని 24708 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 240 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి కోలుకున్నా…కేవలం 300 పాయింట్లు మాత్రమే రికవరైంది. రేపు ఆర్‌బీఐ పరపతి విధానం సమీక్ష ఉంది. ఈ నేపథ్యంలో అనేక కౌంటర్లలో ఒత్తిడి వచ్చింది. ఇవాళ నిఫ్టికి ఐటీ నుంచి పూర్తి సపోర్ట్ లభించింది. ఇక నిఫ్టిలో ఇవాళ టాప్‌లో నిలిచిన ట్రెంట్‌ కేవలం రెండు వారాల్లో రూ. 6300 నుంచి రూ. 7050కి చేరింది. ఈ షేర్‌ ఇవాళ మూడు శాతంపైగా లాభపడింది. నిఫ్టి టాప్‌ ఫైవ్‌లో ఇంకా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్ ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఎస్‌బీఐ లైఫ్‌ ముందుంది. ఈ షేర్‌ తరవాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, గ్రాసిం షేర్లు ఉన్నాయి. ఇవాళ లాభాల్లో ముగిసిన షేర్లకు సమానంగా నష్టాల్లో ముగిసిన షేర్లు ఉన్నాయి.