For Money

Business News

నిలబడిన మార్కెట్లు

ఇవాళ నిఫ్టి ఒకదశలో 150 పాయింట్ల దాకా నష్టపోయినా… దిగువస్థాయిలో అందిన మద్దతు కారణంగా లాభాల్లో ముగిసింది. అధిక స్థాయిలో ఒత్తిడి వచ్చినా… నిఫ్టి 23700పైన ముగియడంలో సక్సెస్‌ అయింది. క్రితం ముగింపుతో పోలిస్తే 92 పాయింట్ల లాభంతో 23,707 పాయింట్ల క్లోజైంది. నిన్న భారీగా దెబ్బతిన్న బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. అలాగే బీమా రంగానికి చెందిన షేర్లకు కూడా మద్దతు లభించింది. ఎఫ్‌ఎంసీజీ రంగానికి చెందిన ట్రెంట్‌ ఇవాళ కూడా భారీగా నష్టపోయింది. ఈ షేర్‌ 2.2 శాతంపైగా నష్టంతో రూ. 6844 వద్ద ముగిసింది. ఇదే ట్రెండ్‌ కొనసాగే పక్షంలో ఇటీవలి కనిష్ఠ స్థాయి రూ. 6400కు తాకవచ్చని కొందరు అనలిస్టులు భావిస్తున్నారు. అయితే పడిన ప్రతిసారీ ఈ షేర్‌ గట్టి మద్దతు లభిస్తోంది. ఇవాళ నిఫ్టి 32 షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా మోటార్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ నిలిచాయి. ఇక నష్ట పోయిన నిఫ్టి షేర్లలో ట్రెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. ఇవాళ 2899 షేర్లు ఎన్‌ఎస్‌ఈలో ట్రేడ్‌ అవగా, 2076 షేర్లు లాభాల్లో ముగియడం విశేషం.