For Money

Business News

దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు

ఐటీ, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో ఇవాళ నిఫ్టి లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల కారణంగా దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ళ ఆసక్తి కనిపించింది. డాలర్‌ ఇండెక్స్‌ బలంగా ఉండటం ఐటీ షేర్లకు కలిసి వచ్చింది. బ్యాంకు షేర్ల నుంచి కూడా స్వల్ప మద్దతు అందింది.దీంతో నిఫ్టి ఇవాళ 19 వేల 393 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 83 పాయింట్లు లాభపడగా… నిఫ్టి నెక్ట్స్‌ సూచీ రికార్డు స్థాయిలో 0.81 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ కూడా అర శాతంపైగా లాభపడటం విశేషం. ఇక నిఫ్టి షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. జియో ఫైనాన్స్‌ ఇవాళ లిస్టయింది. లిస్టింగ్‌ ధర రూ 261.85 కాగా, రూ. 248.90 వద్ద జియో ఫైనాన్స్‌ ముగిసింది. ఇదే ధర వద్ద ఎన్‌ఎస్‌ఈలో రెండు లక్షలపైగా షేర్లకు అమ్మకం దారులు ఉన్నారు. తొలిరోజే ఈ కౌంటర్‌లో లక్షా 50 వేల కోట్లకు పైగా టర్నోవర్‌ జరగడం విశేషం. ఇవాళ పలు అదానీ గ్రూప్‌ షేర్లు వెలుగులో ఉన్నాయి.