For Money

Business News

అదానీలకు సీబీఐ కేసు నుంచి విముక్తి

మోడీ ప్రభుత్వంలో అదానీలకు అన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. తాజాగా ఓ సీబీఐ కేసు నుంచి విముక్తి లభించింది. 2020లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌పై సీబీఐ నమోదు చేసిన కేసు కథ కంచికి చేరింది. ఈ కేసును మూసివేస్తూ సీబీఐ ఇవాళ ఇవాళ కోర్టులో మెమో వేసింది. 2010లో ఆంధ్రప్రదేశ్‌లోని కడప, విజయవాడలో ఉన్న విద్యుత్‌ థర్మల్‌ ప్లాంట్‌లకు ఏపీ జెన్‌కో బొగ్గు దిగుమతి చేసుకుంది. బొగ్గు దిగుమతిలో గొల్‌మాల్‌ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక విచారణ తరవాత 2020, జనవరిలో సీబీఐ కేసు నమోదు చేసింది. 2010లో ఈ రెండు విద్యుత్‌ ప్లాంట్లకు ఆరు లక్షల టన్నుల బొగ్గను ఏపీ జెన్‌కో సంస్థ దిగుమతి చేసుకుంది. ఈ వ్యవహారంలో బిడ్‌లో అర్హత పొందని అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు బొగ్గు సరఫరా కాంట్రాక్ట్‌ దక్కింది. బొగ్గు దిగుమతికి సంబంధించిన బిడ్డంగ్‌లో ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో అదానీల మద్దతు ఉన్న వ్యోమ్‌ ట్రేడ్‌ లింక్స్‌ కంపెనీ కూడా పాల్గొని అర్హత సాధించింది. అదానీకి అర్హత లభించలేదు. కాని చివరి నిమిషంలో వ్యోమ్‌ కూడా టెండర్‌ నుంచి వైదొలగింది. దీంతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అదానీలతో సంప్రదించి… కాంట్రాక్ట్‌ కట్టబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే కేసు నమోదు చేసిన మూడేళ్ళ తరవాత సదరు కేసును మూసివేస్తూ సీబీఐ ఇవాళ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. కోర్టు దీనిపై తుది తీసుకోవాల్సి ఉంది.