For Money

Business News

ఇండిగో ప్రమోటర్ల వాటా అమ్మకం?

ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ ఇండిగో ప్రమోటర్లయిన గాంగ్వాల్‌ కుటుంబం కంపెనీలో తమకున్న వాటాలో కొంత భాగాన్ని అమ్మనున్నారు. ఈ విషయాన్ని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. కంపెనీ ప్రమోటర్లు రేపు అంటే ఆగస్టు 16న 1.34 కోట్ల షేర్లను అమ్మనున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఒక్కో షేర్‌ను రూ. 2400 చొప్పున విక్రయించనున్నారు. సోమవారం ఈ కంపెనీ షేర్‌ ధరతో పోలిస్తే ఈ ధర 5.8 శాతం తక్కువ. ఈ డీల్‌కు మోర్గాన్‌ స్టాన్లీ, జేపీ మోర్గాన్‌, గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ లెండర్స్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది.ఈ కంపెనీలో ప్రమోటర్లకు 67.77 శాతం వాటా ఉండగా, గాంగ్వాల్‌ కుటుంబానికి 29.72 శాతం వాటా ఉంది.