For Money

Business News

హైదరాబాద్‌లో ఎయిర్‌పాడ్స్‌ తయారీ

యాపిల్‌ కంపెనీ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్‌ కేంద్రం కానుంది. ప్రస్తుతం మన దేశంలో యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌లను తయారు చేస్తోంది. ఎయిర్‌ పాడ్స్‌ను హైదరాబాద్‌లోని కొంగర కొలాన్‌ వద్ద నెలకొల్పుతున్న ఫాక్స్‌కాన్‌ యూనిట్‌లో తయారు చేయనున్నారు. హైదరాబాద్‌లో ఏకంగా 40 కోట్ల డాలర్లతో ఫాక్స్‌కాన్‌ తన యూనిట్‌ను సిద్ధం చేస్తోంది. శరవేగంతో ఈ ప్లాంట్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌ కల్లా హైదరాబాద్‌లో ఎయిర్‌ పాడ్స్‌ తయారీ ప్రారంభమౌతుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ తొందర్లోనే ప్రారంభం అవుతుందని.. ఎయిర్‌పాడ్స్‌ను భారీగా వచ్చే ఏడాది ఉత్పత్తి చేస్తారని భావిస్తున్నారు. ట్రూవైర్‌లెస్‌ స్టీరియో ప్రపంచ మార్కెట్‌లో ఎయిర్‌ పాడ్స్‌  వాటా 36 శాతం దాకా ఉంది. హైదరాబాద్‌లో తయారు చేసే ఎయిర్‌ పాడ్స్‌ ను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారని భావిస్తున్నారు.