18500పైన ముగిసిన నిఫ్టి
ఇవాళ నిఫ్టి వంద పాయింట్లు అటు ఇటుగా కదలాడింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి పాజిటివ్ క్లూస్ లేకపోవడంతో నిఫ్టి స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైంది. మిడ్ సెషన్‌కు ముందు 18445కి క్షీణించిన నిఫ్టి తరవాత పలుసార్లు లాభనష్టాల్లోకి వచ్చి… చివరికి 18512 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 28 పాయింట్లు పెరిగింది. నిఫ్టిలో 28
షేర్లు లాభాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్‌కు అండగా ఉన్న నిఫ్టి బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఈ స్థాయి వద్ద బ్యాంక్ నిఫ్టి కొన్నాళ్ళు నిలదొక్కుకునే ప్రయత్నం చేయొచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. నిఫ్టిలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఉదయం నుంచి లాభాల్లోనే ఉంది. 2.68 శాతం లాభంతో ముగిసింది. తరవాత టాటా మోటార్స్ కూడా ఇదే స్థాయిలో లాభాలతో ముగిసింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌కు ఇవాళ పేటీఎం, నైకా, బంధన్ బ్యాంక్ అండగా నిలిచాయి. పే టీఎం షేరును వివిధ బ్రోకింగ్ సంస్థలు రెకమెండ్ చేయడంతో పాటు దిగువస్థాయిలో మద్దతు కూడా లభించింది.