17,700పైన ముగిసిన నిఫ్టి
ఇవాళ జరిగిన మూరత్ ట్రేడింగ్ సాధారణ రోజు ట్రేడింగ్‌ను తలపించింది. భారీ ఎత్తున ఇవాళ లావాదేవీలు జరిగాయి. క్రితం ముగింపుతో పోలిస్తే 162 పాయింట్ల లాభంతో నిఫ్టి 17738 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 47 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. ఇవాళ కూడా బ్యాంక్ షేర్లు నిఫ్టికి అండగా నిలిచాయి. నిఫ్టి బ్యాంక్ ఇవాళ 1.47 శాతం లాభంతో ముగిసింది. దాదాపు ప్రధాన బ్యాంకులు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నెస్లే ఇవాళ కూడా రెండున్నర శాతం పెరగడం విశేషం. నిఫ్టి నెక్ట్స్ మాత్రం కేవలం 0.37 శాతం లాభంతో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1000వైపు పరుగులు తీస్తోంది. ఇటీవల దారుణంగా క్షీణించిన ఎల్ఐసీ షేర్ ఇవాళ 2 శాతం పెరగడం విశేషం. ఏవో కొన్ని మినహా పండుగ పూట… దాదాపు అన్ని షేర్లు నామమాత్రపు లాభాన్నయినా ఆర్జించాయి. రిలయన్స్ ఫలితాలను మార్కెట్ పట్టించుకోలేదు. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటం హిందుస్థాన్ లీవర్ రెండు శాతం నష్టపోయింది.