భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి
మిడ్ సెషన్‌కు ముందు స్వల్ప ఒత్తిడి ఎదుర్కొన్న నిఫ్టి… యూరప్ మార్కెట్లు ప్రారంభమైన తరవాత పటిష్ఠంగా ముందుకు సాగింది. యూరోపియన్ మార్కెట్లు కూడా దాదాపు ఒక శాతం లాభంతో ట్రేడయ్యాయి. నిఫ్టి ఒకదశలో 17410ని తాకినా.. తరవాత స్వల్ప లాభాల స్వీకరణ కారణంగా 17339 పాయింట్ల వద్ద ముగసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 237 పాయింట్లు పెరిగింది. ఇవాళ దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి, మిడ్ క్యాప్ నిఫ్టిలు 1.39 శాతం లాభంతో ముగియడం విశేషం. బ్యాంక్నిఫ్టి 0.76 శాతం లాభానికే పరిమితమైంది. టెక్ షేర్లకు ముఖ్యంగా మిడ్ క్యాప్ షేర్లకు భారీ మద్దతు లభించింది. నిఫ్టి 44 షేర్లు లాభాలతో ముగిశాయి. నష్టపోయిన షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.5 శాతం క్షీణించింది. నౌకరీ డాట్ కామ్ ఇవాళ 11 శాతంపైగా లాభపడింది. ఇక మిడ్ క్యాప్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్ 5 శాతం పైగా పెరగడం విశేషం.