For Money

Business News

17100పైన ముగిసిన నిఫ్టి

ఇవాళ రోజంతా నిఫ్టి గ్రీన్‌లో కొనసాగింది. ఓపెనింగ్‌లో 16,978ని తాకిన నిఫ్టి.. తరవాత రోజంతా లాభాల్లో కొనసాగింది.మిడ్‌ సెషన్‌కు ముందు కాస్త ఒత్తిడి వచ్చినా…వెంటనే కోలుకుంది. యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడ్‌ కావడంతో ఒకదశలో 17186 పాయింట్లకు చేరింది. తరవాత క్లోజింగ్‌లో 171136 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 574 పాయింట్ల లాభంలో 57037 వద్ద ముగిసింది. నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి ఫైనాన్షియల్స్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి ఒక శాతంపైగా లాభపడగా నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు అర శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టలో ఉదయం నుంచి టాప్‌ 5లో రిలయన్స్‌ ఉన్నా… తరవాత ఇతర షేర్లు దూసుకు వచ్చాయి. బీపీసీఎల్ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌ బజాజ్‌ ఫైనాన్స్‌ టాప్‌లో నిలిచింది. ఈ షేర్‌ మూడు శాతం క్షీణించడం విశేషం.