For Money

Business News

నిఫ్టి: 16,350పైన ముగింపు

టెక్నికల్‌గా నిఫ్టికి పెద్ద అవరోధంగా ఉన్న 16,350ని సూచీ ఇవాళ దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్ల లాభంతో 16,364 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం ఊహించినట్లే మార్కెట్‌కు నిన్నటి ముగింపు వద్ద మద్దతు లభించింది. నిఫ్టి క్రితం ముగింపు అయిన 16,280 ప్రాంతానికి వచ్చిన నిఫ్టి మద్దతు అందింది. నిఫ్టి పడినా… ఈ స్థాయిలో మద్దతు లభిస్తుందని ఆల్గో ట్రేడింగ్‌ ఉదయమే హెచ్చరించింది. సరిగ్గా 16,286 ప్రాంతానికి రాగానే మద్దతు లభించింది. అక్కడి నుంచి నిఫ్టి క్రమంగా లాభాల్లోకి వచ్చి… రోజంతా గ్రీన్‌లోనే కొనసాగింది. బ్యాంక్‌ నిఫ్టి నుంచి స్వల్ప మద్దతు లభిచంఇనా… ఇతర షేర్ల బలంతో నిఫ్టి విజయవంతంగా 16,350ని దాటింది. చిన్న, మిడ్‌ క్యాప్‌ షేర్లపై ఆంక్షల గురించి బీఎస్‌ఈ వివరణ ఇవ్వడంతో ఇవాళ మిడ్ క్యాప్‌ సూచీ ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కావడంతో నిఫ్టి బలంగా ముగిసింది.

నిఫ్టి టాప్ గెయినర్స్‌
పవర్‌గ్రిడ్‌ 186.85 5.95
టెక్‌ మహీంద్రా 1,386.00 4.71
టాటా మోటార్స్‌ 306.85 3.86
ఎల్‌ అండ్‌ టీ 1,624.00 2.57
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,092.30 2.38

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐషర్‌ మోటార్స్‌ 2,607.00 -4.09
డాక్టర్‌ రెడ్డీస్‌ 4,708.00 -0.78
సిప్లా 904.50 -0.59
ఐఓసీ 104.05 -0.57
ఓఎన్‌జీసీ 116.40 -0.51