For Money

Business News

15,900పైన ముగిసిన నిఫ్టి

వీక్లీ డెరివేటివ్స్‌, ఐటీ షేర్లలో వచ్చిన ర్యాలీ కారణంగా నిఫ్టి ఇవాళ 15,900పైన ముగిసింది. 15,800 స్థాయిలో పదే పదే ప్రతిఘటనలు ఎదుర్కొన్న నిఫ్టి నిన్న- ఇవాళ అందిన మద్దదుతో 15,924 పాయింట్ల వద్ద ముగిసింది.క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 70 పాయింట్లు లాభపడింది. ఆరంభంలో 15,855 ని తాకిన నిఫ్టికి మిడ్‌ సెషన్‌లో తప్ప ఎక్కడా ఒత్తిడి రాలేదు. మిడ్‌ సెషన్‌లో స్వల్పంగా క్షీణించినా వెంటనే కోలుకుంది. వాస్తవానికి నిఫ్టి ఒకదశలో 15,952 చేరినా స్వల్పంగా క్షీణించింది. అమెరికా ఫ్యూచర్స్‌తోపాటు యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా నిఫ్టి గ్రీన్‌లో ముగియడానికి కారణం..ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్‌ కావడమే. బ్యాంక్‌ నిఫ్టితో పాటు నిఫ్టిలో ఎంపిక చేసిన షేర్లకు మినహా ఎక్కడా మద్దతు అందలేదు. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా నామ మాత్రపు లాభాలతో ముగిసింది. చాలా వరకు యూరో మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,039.05 5.01
ఎల్‌ అండ్‌ టీ 1,601.25 3.66
విప్రో 578.35 2.96
టెక్‌ మహీంద్రా 1,109.25 2.85
హిందాల్కో 401.35 2.48

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఓఎన్‌జీసీ 117.10 -3.06
ఐషర్‌ మోటార్స్‌ 2,664.90 -1.30
భారతీ ఎయిర్‌టెల్‌ 525.45 -0.87
గ్రాసిం 1,554.60 -0.84
కోల్‌ ఇండియా 147.00 -0.78