15800 ఎగువన ముగిసిన నిఫ్టి
ఇవాళ నిఫ్టి రోజంతా తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. రెండు సార్లు నష్టాల్లోకి జారుకున్నా… వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆరంభంలోనే 15977ని తాకిన.. తరవాత ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. మిడ్ సెషన్లో నష్టాల్లోకి వెళ్ళింది. యూరో మార్కెట్లు కూడా డల్‌గా ప్రారంభమయ్యాయి. ఆ తరవాత స్వల్పంగా కోలుకున్నా.. మళ్ళీ గరిష్ఠ స్థాయికి చేరుకోలేకపోయాయి. 15842 వద్ద నిఫ్టి ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 60 పాయింట్లు లాభపడింది. చిత్రంగా ఇవాళ ఇతర సూచీలన్నీ ఆకర్షణీయ లాభాలు గడించినా.. నిఫ్టి మాత్రం స్వల్ప లాభాలకే (0.38శాతం) పరిమితమైంది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఫైనాన్షియల్స్ సూచీ కూడా1.5 శాతం లాభంతో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లూజర్ కాగా, శ్రీ సిమెంట్ కూడా భారీగా క్షీణించింది. నిఫ్టిలో ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది.