For Money

Business News

ఆల్‌టైమ్‌ హైని తాకినా…

నిఫ్టి ఇవాళ ఇంట్రా డేలో ఆల్‌టైమ్‌ హైని తాకింది. గతంలో నిఫ్టి ఆల్‌ టైమ్‌ హై 18604 కాగా, ఇవాళ 18614ని తాకింది. అయితే చివర్లో క్షీణించి 18562 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 50 పాయిట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉండగా మన మార్కెట్లు గ్రీన్‌లో ముగియడం విశేషం. ఉదయం ఆసియా మార్కెట్లు, ఇపుడు యూరోపియన్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ ఒక్కటే అర శాతంపైగా లాభంతో ముగిసింది. బీపీసీఎల్‌, రిలయన్స్‌ నేతృత్వంలో ఇవాళ నిఫ్టి ఆకర్షణీయ లాభాలు గడించింది. ముఖ్యంగా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్‌ ఇవాళ మూడు శాతంపైగా పెరిగింది. నష్టపోయిన నిఫ్టి షేర్లలో హిందాల్కో ముందుంది. ఈ షేర్‌ రెండు శాతం నష్టపోయింది. చమురు ధరలు భారీగా క్షీణించడంతో ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు పెరిగాయి. మెటల్స్ క్షీణించాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన పలు షేర్లు నష్టాలతో ముగిశాయి.