For Money

Business News

కోలుకున్నా… తప్పని భారీ నష్టాలు

మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టిలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. డే ట్రేడింగ్‌ స్క్వేర్‌ ఆఫ్‌కు ముందు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15,711ని తాకింది. మూడింటికల్లా కాస్త కోలుకున్నా… 15,879 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 366 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్‌లో ఎంత భయం నెలకొందంటే… అంతకుముందు మిడ్‌ సెషన్‌ స్థాయి నుంచి నిఫ్టి 230 పాయింట్లు పడింది. స్క్వేర్‌ ఆఫ్‌ కారణంగా నిఫ్టి కోలుకుందే కాని… మార్కెట్‌ సెల్‌ ఆన్‌ రైజ్‌ ఫార్ములా నడుస్తోంది. క్రూడ్‌ ఆయిల్‌ భారీ లాభాలతో ఓఎన్‌జీసీ ఇటీవల ఎన్నడూ లేనివిధంగా 13 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి భారీగా నష్టపోయినా.. 12 షేర్లు లాభాలతో క్లోజ్‌ కావడం విశేషం. నిఫ్టితో పాటు మిడ్‌ క్యాప్‌ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్‌ సూచీలు రెండు నుంచి రెండున్నర శాతం నష్టాలతో ముగిశాయి. కాని బ్యాంక్‌ నిఫ్టి. నిఫ్టి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచీలు మాత్రం నాలుగు శాతంపైగా నష్టపోయాయి. ఈ రెండు సూచీల్లోని అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. రియాల్టీ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్‌ రూ.1377కు పడిపోయింది.