17600పైన క్లోజైన నిఫ్టి
ఇవాళ నిఫ్టికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి గట్టి మద్దతు లభించింది. ఇవాళ ఆర్బీఐ పరపతి విధానం ముందు నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి.. తరవాత కోలుకుని 17,639ని తాకింది. నిఫ్టి ప్రధానంగా ట్రేడింగ్ జరిగింది. మిడ్ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉండటంతో సూచీలు తన లాభాలను కొనసాగించాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 142 పాయింట్ల లాభంతో 17605 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో కూడా ఎంపిన చేసిన షేర్లు లాభాలు పొందాయి. ప్రైవేట్ బ్యాంకులు తప్ప పీఎస్‌యూ బ్యాంకులకు పెద్ద లాభాలు దక్కలేదు. రివర్స్ రెపో రేట్లు తగ్గిస్తారన్న ప్రచారం జరిగినా… చాలా మంది బ్యాంకర్లు ఊహించినట్లు ఆర్బీఐ ప్రస్తుత విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. మిడ్ క్యాప్ నిఫ్టి మాత్రం కేవలం 0.23 శాతంతో ముగిసింది.