పతనంలో 28 ఏళ్ళ రికర్డ్ బ్రేక్?

నిఫ్టి ఇవాళ కూడా భారీ నష్టాలతో ట్రేడవుతోంది. ట్రంప్ ఆంక్షల హెచ్చరిక నేపథ్యంలో మొదలైన పతనం నాన్ స్టాప్‌గా సాగుతోంది. ఇవాళ నిఫ్టి ప్రస్తుతం 245 పాయింట్ల నష్టంతో 22550 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు అంటే 5 నెలల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు సమారు రూ. 2 లక్షల విలువైన షేర్లను అమ్మారు. రీటైల్ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా నిఫ్టి వరుసగా నష్టాలతో ముగుస్తోంది. ఇప్పటి వరకు వరుసగా నాలుగు నెలలుగా నిఫ్టి నష్టాల్లో ముగిసింది. ఇపుడు అయిదో నెల.. అంటే ఫిబ్రవరి నడుస్తోంది. ఈ వారం కూడా నష్టాలతో ముగిసే పక్షంలో వరుసగా అయిదో నెల కూడా నిఫ్టి నష్టాల్ల్లో ముగియనుంది. 1996 తరవాత వరుసగా అయిదు నెలలు నిఫ్టి నష్టాలతో క్లోజ్ కావడం ఇదే మొదటిసారి అవుతుంది. నిఫ్టి ఈవారం 28తో ముగియనుంది. 27న ఫిబ్రవరి ఫ్యూచర్స్ ముగియనున్నాయి. కాబట్టి నిఫ్టిలో రికవరీ కష్టమేనని అనలిస్టులు అంటున్నాయి. నిఫ్టి ఈ నెలలో కూడా నష్టాలతో ముగిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వీరు అంటున్నారు. ఇదే జరిగింది నిఫ్టి 28 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసినట్లే అవుతోంది.