For Money

Business News

బేర్‌ మార్కెట్‌ ర్యాలీ ముగిసినట్లే…

ఉదయం నుంచి కాస్త 16300 ప్రాంతంలో ఉన్న నిఫ్టి యూరో మార్కెట్లు గట్టి దెబ్బతీశాయి. అమెరికా మార్కెట్ల పతనంతో మన మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో వడ్డీ పెంచనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. యూరో మార్కెట్‌ దీన్ని డిస్కౌంట్‌ చేసి… కాస్త నిలకడగా ప్రారంభమౌతుందని భావించినా.. అలా జరగలేదు. ఫ్యూచర్స్‌ డల్‌ ఉండే సరికి మన మార్కెట్‌ వీక్‌గా కొనసాగింది. తీరా యూరో మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ మళ్ళీ నష్టాల్లోకి జారుకోవడం నిఫట్ఇ 16200 దిగుకు పడిపోయింది. 16191 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 16204 వద్ద ట్రేడవుతోంది. 274 పాయింట్ల నష్టంతో నిఫ్టి ట్రేడవుతోంది. బేర్‌ ఫేజ్‌లో వచ్చిన రిలీఫ్‌ ర్యాలీ ముగిసినట్లే అనలిస్టులు భావిస్తున్నారు.ఇపుడు నిఫ్టికి ప్రధాన మద్దతు స్థాయిai 16225-20,16162-57,16099-94,16023-18,16003-98,15920-15,గా చెప్పుకోవచ్చు. ఇవాళ ఏషియన్‌ పెయింట్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా ఉండటం విశేషం. రిలయన్స్‌ ఇవాళ రెండున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. మెటల్స్‌, ఐటీ, బ్యాంక్‌ షేర్లలో తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది.