పడినా… 26,000పైనే
నిఫ్టి బలంగా ఉన్నా… బ్యాంక్ నిఫ్టి బలహీనంగా ఉండటంతో మార్కెట్ సెంటిమెంట్ స్వల్పంగా దెబ్బతింది. ఉదయం నుంచి లాభాల్లోఉన్న నిఫ్టిపై బ్యాంకు షేర్ల ఒత్తిడి పెరిగింది. ఇతర షేర్లు నిఫ్టిని ఆదుకున్నా… మిడ్‌సెషన్ తరవాత నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. వారాంతాన ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం వల్ల కూడా నిఫ్టి గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 120 పాయింట్లు పడింది.కేవలం 37 పాయింట్లతో నిఫ్టి 26,178 వద్ద ముగిసింది. ప్రధాన సూచీలన్నీ దాదాపు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. కొన్ని స్వల్పంగా క్షీణించాయి. అయితే బ్యాంక్ నిప్టి ఇవాళ ఒక శాతం క్షీణించింది. ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రాతినిధ్యం వహించే ఫైనాన్షియల్స్ నిఫ్టి కూడా దాదాపు ఒక శాతం దాకా క్షీణించింది. నిఫ్టిలో 29 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ లార్జ్ క్యాప్ ఫార్మా షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. క్రూడ్ ధరలు 70 డాలర్లకు చేరడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు కూడా పెరిగాయి. బీపీసీఎల్ ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్ ఇవాళ ఆరు శాతంపైగా పెరిగింది. సిప్లా, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్, రిలయన్స్ షేర్లు తరవాతి స్థానంలో ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌లో పవర్‌గ్రిడ్ ముందుంది. ఈ షేర్ మూడు శాతం దాకా క్షీణించింది. భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్ షేర్లు తరవాతి స్థానంలో ఉన్నాయి. నిఫ్టిలో అధిక వెయిటేజీ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ నష్టాలు నిఫ్టిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎథనాల్ ధరలను పెంచుతామని కేంద్ర ఉన్నతాధికారులు చెప్పడంతో ఇవాళ చక్కెర షేర్లు వెలుగులో ఉన్నాయి. మెజారిటీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.