నిఫ్టిని ఆదుకున్న నిఫ్టి బ్యాంక్
యూరప్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నా మన మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. బ్యాంక్ నిఫ్టి భారీ లాభాలతో నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ముగిసింది. దిగువ స్థాయి నుంచి నిఫ్టి ఏకంగా 700 పాయింట్లకు పైగా పెరిగింది. బ్యాంక్ నిఫ్టి 0.85 శాతం లాభంతో క్లోజ్ కాగా, నిఫ్టి 0.4 శాతం లాభంతో 17222 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 69 పాయింట్లు లాభపడింది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ మాత్రం అరశాతం వరకు నష్టంతో ముగిశాయి. ఈ రెండు సూచీలు రోజంతా నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టిలో ఇవాళ యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీ లాభాలతో ముగిశాయి. ఇటీవల బాగా క్షీణించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 1401కి పడినా కోలుకుని రూ.1432 వద్ద ముగిసింది.