BANK NIFTY: 36100 కీలక స్థాయి
నిఫ్టి బ్యాంక్ ఏప్రిల్ సిరీస్‌కు రోల్ ఓవర్స్ అద్భుతంగా ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్ మూడు నెలల సగటు రోల్ ఓవర్ 77 శాతం కాగా, ఈ నెల 92 శాతం ఉంది. కాబట్టి నిఫ్టి ఏమాత్రం క్షీణించినా కొనుగోలు చేయమని డేటా అనలిస్ట్ వీరేందర్‌కుమార్ విశ్లేషిస్తున్నారు. ఎలాంటి పరిస్థితిలోనూ నిఫ్టి బ్యాంక్‌ను షార్ట్ చేయొద్దని చెబుతూనే ఇన్వెస్టర్లు 3600 స్థాయిని గమనించాలని సలహా ఇస్తున్నారు. బ్యాంక్ నిఫ్టికి తొలి మద్దతు 36160 ప్రాంతంలో ఉందని ఆయన చెబుతూ..ఈ స్థాయికి వస్తే కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. ఈ స్థాయిని కోల్పోతే బ్యాంక్ నిఫ్టికి వెంటనే 36020 వద్ద మద్దతుకు ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టి పెరిగితే తొలి ప్రతిఘటన 36610 వద్ద రెండో ప్రతిఘటన 36810 వద్ద ఎదురు కానుందని వీరేందర్ అంటున్నారు. ఈయన కూడా బై ఆన్ డిప్స్ వ్యూహం మంచిదని అంటున్నారు. ఇతర లెవల్స్, విశ్లేషణ కోసం దిగువ వీడియో చూడగలరు.
https://www.youtube.com/watch?v=KIeBiMKfwEU