For Money

Business News

18200 చేరువలో నిఫ్టి

సింగపూర్ నిఫ్టి ఉత్సాహంతో నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18,184ని తాకింది. ఈ స్థాయిలో స్వల్ప లాభాల స్వీకరణతో 18143ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 96 పాయింట్ల లాభంతో 18151 వద్ద ట్రేడవుతోంది. మెటల్స్‌ ఇవాళ భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్స్‌లో గట్టి ర్యాలీ కన్పిస్తోంది. గత కొంత కాలంగా మార్కెట్‌లో అప్ ట్రెండ్‌ కేవలం కొన్ని షేర్లకే పరిమితం అవుతోంది. ఈసారి కూడా నిఫ్టి షేర్లలోనే ర్యాలీ కన్పిస్తోంది. మిడ్‌ క్యాప్‌లో దాదాపు క్రితం స్థాయిలోనే ఉంది. బ్యాంక్‌ నిఫ్టి మరో 0.7 శాతం పెరగ్గా, నిఫ్టి నెక్ట్స్‌ 0.5 శాతం పెరిగింది. టాటా టెలి స్వల్ప నష్టంతో ప్రారంభం కాగా, ఐడియా స్వల్ప లాభంతో ప్రారంభమైంది. ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన డెల్టా కార్ప్‌ ఓపెనింగ్‌లో 5 శాతం లాభపడింది.