భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
ఒక్క ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి రావడంతో నిఫ్టి దాదాపు 250 పాయింట్లు, సెన్సెక్స్ 800 పాయింట్ల దాకా క్షీణించాయి. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి బలహీనపడటంతో ఐటీ షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ కౌంటర్లు మినహా మిగిలిన షేర్లలో అమ్మకాలు చాలా జోరుగా ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్కు వెన్నుముక అయిన మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టటి 1.7 శాతంపైగా నష్టంతో ఉంది. ఇక నిఫ్టి 222 పాయింట్ల నష్టంతో 17025 వద్ద ట్రేడవుతోంది. ఒకదశలో నిఫ్టి 17002ని తాకింది. మరి మిడ్ సెషన్లో నిఫ్టి17002ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి. 100 రోజుల చలన సగటును నిఫ్టి కోల్పోవడంతో తదుపరి మద్దతుతో మార్కెట్లో అయోమయం నెలకొంది.