For Money

Business News

17400పైన నిఫ్టి

మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17410కి చేరింది. ప్రస్తుతం 86 పాయింట్ల లాభంతో 17408 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఇపుడు తొలి ప్రతిఘటనను తాకింది. మరి రెండో ప్రతిఘటన వరకు వెళుతుందా అన్నది చూడాలి.ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున నిఫ్టిలో హెచ్చతగ్గులకు ఆస్కారం ఉంది. టాటా మోటార్స్‌ ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్‌ను కొనాల్సిందిగా పలు బ్రోకరేజ్‌ సంస్థలు రెకమెండ్‌ చేస్తున్నాయి. టేకోవర్‌ వార్తలతో గాంధిమతి బటర్‌ఫ్లయ్‌ షేర్‌ లాభాల్లో ఉంది. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి షేర్లలో పేజ్‌ ఇండస్ట్రీస్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.