17,300పైన నిఫ్టి…నిలబడేనా?
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17300పైకి చేరాక.. ఇపుడు 17284 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 70 పాయింట్ల లాభంతో నిఫ్టి ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా మెజారిటీ సూచీలు నామ మాత్రపు లాభాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ నిఫ్టి 0.68 శాతం లాభంతో ఉంది. మరి మార్కెట్ ఈ స్థాయిలో నిలబడుతుందా అన్నది చూడాలి. ప్రముఖ అనలిస్ట్ మితేస్ ఠక్కర్ ఇవాళ సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌తో మాట్లాడుతూ…నిఫ్టి పెరిగితే అమ్మడానికి ఛాన్స్‌గా భావించాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి నిఫ్టిలో 42 షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ ఇవాళ కూడా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో మారుతీ ముందుంది. నష్టాల్లో పవర్‌గ్రిడ్ ముందుంది. మిడ్ క్యాప్ నిఫ్టిలో టీవీఎస్ మోటార్స్ 3 శాతం నష్టంతో టాప్ గెయినర్‌గా ఉంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇవాళ ఒక శాతం నష్టంతో ఉంది.