నిఫ్టి ఓపెనింగ్@16,900
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి 16876 వద్ద ఓపెనైంది. వెంటనే 16900కి చేరిన నిఫ్టి… అదే స్థాయిలో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 237 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిన్న క్లోజింగ్‌లో మార్కెట్‌ను షార్ట్ చేసిన వారు భారీగా నష్టపోయారు. దిగువ స్థాయిలో కొన్నవారికి కనకవర్షమే. మార్కెట్లో బై ఆన్ డిప్ ఫార్ములా విజయవంతంగా నడుస్తోంది. నిఫ్టిలో మొత్తం 48 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ కూడా నిఫ్టికి నిఫ్టి బ్యాంక్‌కు గట్టి మద్దతు లభించింది. ఈ సూచీ 1.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్ షేర్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. జొమాటొ షేర్ ఇవాళ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతోంది. క్రూడ్ ధరలు తగ్గడంతో ఆటో షేర్లలో ఆసక్తి కన్పిస్తోంది. అలాగే పెయింట్ కంపెనీ షేర్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి.