నిఫ్టి@16,000… స్టాక్ మార్కెట్లో కొత్త చరిత్ర
దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ సూచీలు ఆల్ టైమ్ రికార్డు చేరడంలోనూ రికార్డు సృష్టించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) చరిత్రలో తొలిసారి నిఫ్టి 16,000ని దాటింది. ఇవాళ ఉదయం 15,951 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 15,914కి చేరినా… తరవాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 16,014ను తాకిన తరవాత ఇపుడు 16,005 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి ట్రేడింగ్ పూర్తిగా నిఫ్టి షేర్లకే పరమితం అయింది. ఇతర సూచీల్లో పెద్దగా మార్పు లేదు. వాస్తవానికి మిడ్ క్యాప్ సూచీ 0.35 శాతం నష్టంతో ట్రేడవుతోంది.