26 శాతం క్షీణించిన నెట్‌ఫ్లిక్స్ షేర్
రాత్రి అమెరికా మార్కెట్లలో నెట్‌ఫ్లిక్స్ షేర్ 3.18 శాతం లాభంతో 348.61 డాలర్ల వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తరవాత నెట్‌ఫ్లిక్స్ ఫలితాలను ప్రకటించింది. గడచిన దశాబ్దంలో ఎన్నడూ లేనివిధంగా నెట్‌ఫ్లిక్స్‌లో కేవవలం మూడు నెలల్లో (తొలి త్రైమాసికంలో) ఏకంగా 2 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. దీంతో పోస్ట్ మార్కెట్ ట్రేడింగ్ లో షేర్ 25.73 శాతం నష్టంతో 258.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రెండో త్రైమాసికంలో కూడా కస్టమర్ల సంఖ్య తగ్గవచ్చని కంపెనీ పేర్కొనడంతో షేర్‌పై భారీ ఒత్తిడి వస్తోంది. పాస్‌వర్డ్ షేరింగ్‌ను మానెటైజింగ్ చేయడంతో పాటు ఒకట్రెండు సంవత్సరాల్లో ప్రకటనలను పెంచేందుకు ప్రయత్నిస్తామని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్ ప్రోత్సాహకరంగా ఉందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. స్విడ్ గేమ్‌తో ఆసియా మార్కెట్లలో రాణించినట్లు పేర్కొంది. ఆసియాలో పది లక్షల మంది కొత్త సబ్‌స్క్రయిబర్స్ చేరినట్లు కంపెనీ పేర్కొంది.