For Money

Business News

నవభారత్‌ వెంచర్‌ ఫలితాలు సూపర్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నవభారత్ వెంచర్స్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. కంపెనీ రూ.515.71 కోట్ల ఆదాయం పై రూ .104.72 కోట్ల నికరలాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో కంపెనీ రూ .258.57 కోట్ల ఆదాయంపై రూ .32.50 కోట్ల నికరలాభం మాత్రమే ఆర్జించింది. దీంతో ఆదాయం 99 శాతం, నికరలాభం 222 శాతం పెరిగాయి. ఫెర్రో అల్లాయ్స్‌ అధికంగా ఎగుమతి చేయడంతో పాటు, ఒడిశా పవర్ ప్లాంటులోని 60 మెగావాట్ల యూనిట్ (ఐపీపీ) గత ఏడాది జులైలో అందుబాటులోకి రావటంతో కంపెనీ మెరుగైన పనితీరు చూపగలిగింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి రూ .1253.98 కోట్ల ఆదాయాన్ని, రూ .252.74 కోట్ల నికరలాభాన్ని సంస్థ ఆర్జించింది . ఫెర్రో అల్లాయ్స్, విద్యుత్తు విభాగాల పనితీరు ఆకర్షణీయంగా ఉన్నట్లు నవభారత్ వెంచర్స్ సీఈఓ అశ్విన్ దేవినేని ఈ సందర్భంగా తెలిపారు . జాంబియాలో బొగ్గు, విద్యుదుత్పత్తి కార్యకలాపాలు మెరుగు పడుతున్నాయని అన్నారు. ఐవరీకోస్ట్ మ్యాంగనీస్ గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వ అనుమతి లభించిందని అశ్విన్ వివరించారు .