For Money

Business News

2 ఏళ్ళ కనిష్టానికి వాల్‌స్ట్రీట్‌

టెక్‌, ఐటీ, సంప్రదాయ పరిశ్రమలు.. అన్ని రంగాల షేర్లపై వాల్‌స్ట్రీట్‌లో తీవ్ర ఒత్తిడి వచ్చింది. టెక్‌ షేర్లలో కొన్ని రోజులుగా వస్తున్న అమ్మకాలతో రాత్రి 2020 జూన్‌ తరవాత కనిష్ఠ స్థాయి 12,317 పాయింట్లకు క్షీణించింది. ప్రధాన టెక్‌ కంపెనీలన్నీ భారీగా నష్టపోయాయి. టెస్లా అత్యధికంగా 8 శాతం నష్టపోయింది. ట్విటర్‌ కొంటానని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించినప్పటి నుంచి ఈ కౌంటర్‌లో అమ్మకాలు సాగుతున్నాయి, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఏఎండీ షేర్లు నాలుగు నుంచి అయిదు శాతం నష్టంతో ముగిశాయి. అమెజాన్‌, ఎన్‌విడా ఏడు శాతంపైగా, ఫేస్‌బుక్‌ ఆరు శాతంపైగా నష్టంతో క్లోజయ్యాయి. టెక్‌తో పాటు ఐటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు కూడా కుప్పకూలడంతో ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 3.56 శాతం క్షీణించింది. ఇక ఎనర్జీతో పాటు ఇతర షేర్ల నష్టాల కారణంగా 3 శాతం పైగా నష్టంతో డౌజోన్స్‌ క్లోజైంది.