For Money

Business News

దుమ్మురేపుతున్న టెక్‌ షేర్లు

వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. నాన్‌ ఫామ్‌ పే రోల్స్‌ ఆశాజనకంగా ఉండటంతో నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఇవాళ దుమ్మురేపుతున్నాయి. నిన్నటి నష్టాలను నాస్‌డాక్‌ పూడ్చుకుంది. టెక్‌, ఐటీ షేర్లలో గట్టి ర్యాలీ వచ్చింది. తాజా సమాచారం మేరకు నాస్‌డాక్‌ ఒకశాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.72 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎన్‌విడియా, ఏఎండీ షేర్లు మూడు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఇన్నాళ్ళు జోరుగా ఉన్న డౌజోన్స్ మాత్రం 0.05 శాతం లాభంతో అంటే నామమాత్రపు లాభాల్లో ఉంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల క్రూడ్‌ సరఫరాకు ఎలాంటి ఢోకా లేకపోవడంతో బ్రెంట్‌ క్రూడ్‌ ఏకంగా 4 శాతంపైగా క్షీణించింది. డాలర్‌ స్థిరంగా ఉంది. అయినా బులియన్‌ మార్కెట్‌ గట్టి అమ్మకాల ఒత్తిడి వస్తోంది. వెండి నాలుగు శాతంపైగా క్షీణించింది.

Leave a Reply