నష్టాల్లో నాస్డాక్
ఇవాళ వచ్చిన కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాతో మార్కెట్లో మిశ్రమ స్పందన కన్పిస్తోంది. ద్రవ్యోల్బణం ఇంకా 40 ఏళ్ళ గరిష్ఠస్థాయిలోనే ఉందని ఇవాళ్టి డేటా తేల్చింది. దీంతో జూన్లో మళ్ళీ వడ్డీ రేట్ల పెంపు ఖాయమని మార్కెట్లో మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నాస్డాక్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఒక శాతంపైగా లాభాలు ఆర్జంచిన నాస్డాక్… ఆ లాభాలను ఇవాళ కోల్పోయింది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు స్థిరంగా క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా క్షీణించింది. మరోవైపు క్రూడ్ ఆయిల్ 5 శాతంపైగా పెరిగింది.