భారీ లాభాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్
ఫేస్‌బుక్ లాభాలు నాస్‌డాక్‌కు జోష్ ఇచ్చింది. అలాగే జీడీపీ వృద్ధిరేటు మందగించడంతో వడ్డీ రేట్లు పెంచే విషయంలో ఫెడరల్ రిజర్వ్ దూకుడు తగ్గుతుందన్న ఆశతో రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అర శాతం వడ్డీ రేట్ల పెంపును మార్కెట్ ఇది వరకే డిస్కౌంట్ చేసిందని, మరోవైపు బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో ర్యాలీ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. రాత్రి నాస్‌డాక్ 3 శాతం పైగా లాభడగా, ఎస్ అండ్ పీ 500 సూచీ రెండున్నర శాతం లాభపడింది. ఇక డౌజోన్స్ కూడా 1.85 శాతం లాభపడిందంటే.. మార్కెట్ రికవరీ ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుంది. డాలర్ ఇండెక్ 20 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది.