For Money

Business News

నాస్‌డాక్‌ ర్యాలీ కొనసాగింపు

యూరప్‌ మార్కెట్లు భారీ లాభాలతో క్లోజ్‌ కాగా, అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 2.96 శాతం లాభంతో ముగిసింది. జర్మనీ డాక్స్‌ 2.79 శాతం లాభపడింది. ఉ్రకెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా యూరో మార్కెట్లు భారీ దెబ్బతిన్న విషయం తెలిసిందే. శాంతి చర్చలపై వస్తున్న సానుకూల వార్తలతో భారీగా లాభపడ్డాయి. నాస్‌డాక్‌ ఒక శాతంపైగా లాభపడగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ అర శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. క్రూడ్‌ భారీ పతనంతో ఎనర్జీ షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో డౌజోన్స్‌ లాభాలు 0.36 శాతానికి పరిమితమయ్యాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ బలహీనపడింది. క్రూడ్‌ కూడా రెండు శాతం దాకా నష్టపోయింది.