For Money

Business News

ఏఐ ఖర్చుల భయంతో…

నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగివాయి. మూడు సూచీలు నష్టాల్లోముగిసినా… నాస్‌డాక్‌ ఏకంగా 2.76 శాతం క్షీణించింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.86 శాతం, డౌజోన్స్‌ 0.9 శాతం తగ్గాయి. నిన్న మైక్రోసాఫ్ట్‌, మెటా కంపెనీలు అద్భుత ఫలితాలు ప్రకటించాయి. కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) తాము పెడుతున్న పెట్టుబడులు సరిపోవడం లేదని, మరింతగా పెట్టుబడులు పెంచాల్సి ఉందని ఈ రెండు కంపెనీలు అన్నాయి. దీని ప్రభావం కంపెనీ లాభాలపై పడొచ్చని కంపెనీలు ప్రకటించాయి. ఈ ప్రకటన ఐటీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది.మెటా షేర్‌ 4 శాతం, మైక్రోసాఫ్ట్‌ షేర్ 6 శాతం నష్టపోయాయి. అయితే ఇపుడు అమెరికా ఫ్యూచర్స్‌ లాభాల్లో ఉన్నాయి. రాత్రి డాలర్‌ స్వల్పంగా తగ్గింది. డాలర్‌ ఇండెక్స్‌ 104 దిగువకు పడిపోయింది. అయితే క్రూడ్‌ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 74 డాలర్ల వద్ద ఉంది. రాత్రి బంగారం భారీ క్షీణించినా.. ఇపుడు స్వల్ప లాభంతో ట్రేడవుతోంది.

Leave a Reply