జెట్ స్పీడుతో పతనం
మళ్ళీ కరోనా సమయం గుర్తు చేస్తున్నాయి ఈక్విటీ మార్కెట్లు. ముఖ్యంగా వాల్‌స్ట్రీట్ పతనం ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేస్తోంది. వడ్డీ రేట్ల పెంపు తరవాత మార్కెట్లు కోలుకోవడం ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు చూస్తూ వచ్చారు. ఎందుకంటే వడ్డీ రేట్ల పెంపు ప్రతిపాదనకు ముందే మార్కెట్ దాన్ని డిస్కౌంట్ చేస్తుంది. ఈ ఏడాది కూడా ఫెడ్ నిర్ణయానికి ముందు ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వడ్డీ రేట్ల పెంపుతో పాటు కంపెనీ ఆర్థిక ఫలితాలు .. సరిగా లేకపోవడంతో అమ్మకాల ఒత్తిడి అధికమౌతోంది. ముఖ్యంగా నాస్‌డాక్‌లో వస్తున్న ఒత్తిడి న్యూ ఏజ్ ఇన్వెస్టర్లకు అయోమయంలో పడేసింది. అనేక మంది ఇన్వెస్టర్లు నష్టాలతో బయటపడుతున్నారు. రాత్రి కూడా నాస్‌డాక్ ఏకంగా 4.29శాతం క్షీణించింది. ఇక ఎస్ అండ్ పీ 500 500 సూచీ 3.2 శాతం తగ్గింది. డౌజోన్స్ రెండు శాతం దాకా నష్టపోవడమంటే… ఎకనామీ షేర్లలో కూడా ఒత్తిడి అధికంగా ఉందని అర్థం. నిన్న అమెరికా మార్కెట్‌లో డాలర్, క్రూడ్, బులియన్, బాండ్ ఈల్డ్స్.. అన్నీ ఒకేరోజు నష్టపోవడం విశేషం.