For Money

Business News

కుప్పకూలిన నాస్‌డాక్‌

మరోసారి అమెరికాలో ఐటీ, టెక్‌ కంపెనీల షేర్లలో అమ్మకాల వెల్లువెత్తాయి. ఆగస్టు నెలలో కొత్త ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య మార్కెట్‌ అంచనాల కంటే చాలా తక్కువగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో జారకుంది. సవరించిన డేటా ప్రకారం జులై నెలలో నాన్‌ ఫార్మ్‌ పే రోల్స్‌ 1,64,000కు పెరగ్గా, ఆగస్టు నెలలో కొత్తగా ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య 1,42,000కు తగ్గింది. దీంతో స్టాక్‌ మార్కెట్‌ డీలా పడింది. నిజానికి ఎకానమీ షేర్లను ప్రతిబింబించే డౌజోన్స్‌ కేవలం 0.89 శాతం క్షీణించగా… ఐటీ, టెక్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్‌డాక్‌, ఎస్‌ అండ్ పీ 500 సూచీలు భారీగా క్షీణించాయి. తాజా సమాచారం మేరకు నాస్‌డాక్‌ 2.52 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1061 శాతం మేర నష్టంతో ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లలో బ్రాడ్‌కామ్‌ 9 శాతం దాకా నష్టపోగా, ఎన్‌విడియా ఇవాళ కూడా 5 శాతంపైగా నష్టపోయింది. నాన్‌ ఫామ్‌ పేరోల్స్‌ నిరాజనకంగా ఉండటంతో క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్‌ ధర 71 డాలర్ల లోపుకు పడిపోయింది. బులియన్‌ ధరలు కూడా తగ్గాయి. డాలర్‌ ఇండెక్స్ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. కొత్త ఉద్యోగాల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదంటే వడ్డీ రేట్ల తగ్గింపు అధికంగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నారు. ఈనెల 18న ఫెడ్‌ వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడుతుందేమో చూడాలి.

Leave a Reply