For Money

Business News

నాస్‌డాక్‌కు మళ్ళీ భారీ నష్టాలు

నిన్న రాత్రి ఒక శాతంపైగా నష్టపోయిన నాస్‌డాక్‌ తాజా సమాచారం మేరకు 1.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. రేపు చిప్‌ మేకర్‌ ఎన్‌విడియా ఫలితాలు రానున్న నేపథ్యంలో టెక్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా దాదాపు ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎన్‌విడియా ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయా అన్న అంశంపై మార్కెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ వరుసగా మూడో నెల కూడా క్షీణించింది. ట్రంప్‌ విధానాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అనేక రకాల దిగుమతులపై ట్రంప్‌ భారీ మొత్తంలో సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుదలపై జనంలో విశ్వాసం సన్నగిల్లుతోంది. కన్జూమర్‌ కాన్ఫిడెన్స్ సూచీ పతనంతో ఆయిల్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు రెండు శాతం దాకా తగ్గాయి. డాలర్‌ ఇండెక్స్‌ కూడా 106కి పరిమితమైంది.