నాస్డాక్లో ‘కరక్షన్’ ప్రారంభం
అమెరికాలో టెక్, ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాలు రాత్రి కూడా కొనసాగాయి. రాత్రి నాస్డాక్ 1.15 శాతం క్షీణించింది. సూచీ గరిష్ఠ స్థాయి నుంచి పది శాతం క్షీణిస్తే … ఆ సూచీలో కరెక్షన్ మొదలైనట్లు మార్కెట్ భావిస్తుంది. నిన్నటి ముగింపుతో నాస్డాక్ ఆల్ టైమ్ గరిష్ఠస్థాయి నుంచి 10.7 శాతం క్షీణించింది. రాత్రి యాపిల్, అమెజాన్, టెస్లా వంటి షేర్లలో ఒత్తిడి కొనసాగింది. 2021 ఆరంభంలో కూడా నాస్డాక్ కరెక్షన్లోకి వెళ్ళింది. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 8 మధ్య కాలంలో 10 శాతంపైగా క్షీణించింది. గడచిన రెండు సంవత్సరాల్లో నాస్డాక్ కరెక్షన్లోకి వెళ్ళడం ఇది నాలుగోసారి. దీనికి కారణం కరోనానే. ఈసారి వడ్డీ రేట్ల పెంపు కారణం కానుంది. మరి ఈ కరెక్షన్ ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.