లాభాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్
రాత్రి వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఒకవైపు బాండ్ ఈల్డ్స్ పెరిగి 1.9 శాతం దాటినా.. బ్యాంకు షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌లు ఒకటి నుంచి రెండు శాతం వరకు పెరగడంతో నాస్డాక్ రాత్రి 1.28 శాతం లాభంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.84 శాతం లాభపడింది. డౌజోన్స్ కూడా రాత్రి ఒక శాతంపైగా లాభంతో క్లోజ్ కావడం విశేషం. 95.56 వద్ద డాలర్ ఇండెక్స్ స్థిరంగా ఉంది. ఆయిల్ సరఫరా పెంచేందుకు కోసం ఇరాన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి క్రూడ్ మూడు శాతం దాకా పడింది. కాని తెల్లవారేసరికల్లా మళ్ళీ కోలుకుంది. ఇపుడు బ్రెంట్ క్రూడ్ 91.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.