For Money

Business News

మూరత్‌ ట్రేడింగ్‌: భారీ లాభాల్లో నిఫ్టి

దీపావళి ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్‌లో నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 110 పాయింట్ల లాభంతో 17935 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి మార్కెట్‌కు మద్దతుగా నిలిస్తోంది. కాని అసలు యాక్షన్‌ మిడ్‌ క్యాప్‌లో ఉంది. ఈ సూచీ దాదాపు ఒక శాతం వరకు లాభంతో ట్రేడవుతోంది. నిన్న ఫలితాలు ప్రకటించిన ఎస్‌బీఐ ఇవాళ కూడా ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌ టాప్‌ గెయినర్స్‌లో ముందున్నాయి. కేవలం ఐసీసీఐ బ్యాంక్‌, సిప్లా షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఇక మిడ్‌ క్యాప్‌లోని 50 షేర్లూ లాభాల్లో ఉన్నాయి. టాటా పవర్‌ 1.6 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా ఉంది. చిత్రమేమిటంటే సూచీలు, షేర్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. కాని లాభాలన్నీ నామమాత్రంగా ఉన్నాయి.