For Money

Business News

జియో ఫోన్‌ నెక్ట్స్‌ వచ్చేసింది… స్టోర్‌కు వెళ్ళొద్దు

ఇవాళ్టి నుంచి రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌లో జియో ఫోన్‌ నెక్ట్స్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ఫోన్‌ కొనేందుకు మీరు నేరుగా స్టోర్‌ వెళ్ళరాదు. ముందు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. లేదా 7018270182కు Hi అని మెసేజ్‌ పంపాలి. అపుడు అది మీ లొకేషన్‌ అడుగుతుంది. ఆ వివరాలు ఇచ్చిన తరవాత మీకు దగ్గర్లో ఉన్న రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌ వివరాలు పంపిస్తుంది. ఇదే సమాచారం స్టోర్‌కు కూడా వెళుతంది. అపుడు కస్టమర్లు స్టోర్‌కు వెళ్ళి ఫోన్‌ కొనుగోలు చేయొచ్చు. ఫోన్‌ ధర రూ. 6,499. అయితే రూ. 1999 చెల్లించి ఫోన్‌ కొనుగోలు చేయొచ్చు. మిగిలిన మొత్తాన్ని వాయిదాలలో కట్టుకునే సదుపాయం ఉంది.