నేడూ మాస్కో ఎక్స్ఛేంజీ మూత
ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజీ మూత పడింది. ఇవాళ కూడా ఓపెన్ చేయడం లేదని అధికారులు తెలిపారు. ఇండెక్స్ 34 శాతం పైగా పడిపోవడంతో ఎక్స్ఛేంజీని మూసివేశారు. రష్య కంపెనీలపై అమెరికాతో సహా యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించడంతో అనేక కంపెనీల షేర్లు క్షీణించాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో డౌజోన్స్ రష్యా జీడీఆర్ ఇండెక్స్ ట్రేడవుతోంది. ఇది రష్యాలోని ప్రధా కంపెనీల షేర్లను ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సూచీ గత అయిదు ట్రేడింగ్ సెషన్స్‌లో 93 శాతం క్షీణించింది. మరోవైపు రష్యాలోని మరో స్టాక్ ఎక్స్ఛేంజీ అయిన సెయింట్ పీటర్స్బర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఇవాళ్టి నుంచి ప్రారంభించనుంది. అయితే కొద్దిసేపు మాత్రమే పని చేస్తుందని అధికారులు తెలిపారు.