For Money

Business News

మాస్‌చిప్‌… నో సెల్లర్స్‌

సెమికండక్టర్స్ పరిశ్రమ గురించి ఇవాళ ప్రధాని మోడీ చేసిన స్పీచ్‌తో ఒక్కసారిగా చిప్‌ కంపెనీ షేర్లకు భారీ డిమాండ్‌ వచ్చింది. అనేక షేర్లలో అమ్మకందారులు లేరు. ప్రపంచ ప్రఖ్యాత సెమికండక్టర్‌ కంపెనీలు క్లిష్ట సమయంలో భారత్‌పై ఆధారపడవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సెమికాన్‌ ఇండియా 2024 ఈవెంట్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వాడే ఎలక్ట్రిక్‌ వస్తువుల్లో భారత్‌ చిప్‌లు ఉండాలని ఆయన అన్నారు. సెమికండక్టర్‌ పరిశ్రమకు తమ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలిస్తుందని హామి ఇచ్చారు. ప్రధాని హామీ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లోని సెమి కండక్టర్‌తో పాటు చిప్‌ కంపెనీ షేర్లకు భారీ డిమాండ్‌ వచ్చింది. మధ్యాహ్నం వరకు డల్‌గా ఉన్న ఈ కౌంటర్లలో ఒక్కసారిగా వచ్చిన కొనుగోళ్ళ డిమాండ్‌ కారణంగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. హైదరాబాద్‌కు చెందిన మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ షేర్ ఒక్కసారి పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఈ షేర్‌ నిన్న రూ.236.5 వద్ద ముగిసింది. ఇవాళ ఉదయం రూ.237 వద్ద ప్రారంభమైన ఈ షేర్‌ మిడ్‌ సెషన్‌ వరకు రూ. 236.35 ప్రాంతంలో కొనసాగింది. ప్రధాని మోడీ స్పీచ్‌ తరవాత ఈ షేర్‌ రూ. 248.15కి చేరింది. ఈ అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద దాదాపు 8 లక్షల షేర్లకు డిమాండ్‌ ఉన్నా… అమ్మకందారులు లేరు. మాస్‌ చిప్‌తో పాటు ఏఎస్‌ఎం టెక్నాలజీస్‌ కూడా 5.17 శాతం లాభంతో ముగిసింది. సీజీ పవర్‌ 4.39 శాతం, ఎస్‌పీఈఎల్‌ సెమికండక్టర్‌ 5 శాతం, ఆర్‌ఐఆర్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ షేర్‌ కూడా 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద ముగిసింది.

Leave a Reply