For Money

Business News

ఈనెలలో లాక్‌ఇన్‌ నుంచి బయటకు

ఈఏడాది రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 118 కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌లో ప్రవేశించాయి. ఇందులో 62 సాధారణ ఐపీఓలు కాగా, 56 ఐపీఓలు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలో లిస్టయ్యాయి. బ్రోకరేజ్ సంస్థ నువామా నివేదిక ప్రకారం ఇటీవల పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన ఆఫర్లలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, మ్యాన్‌కైండ్ ఫార్మా, KRN హీట్ ఎక్స్‌ఛేంజర్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, భారతి హెక్సాకామ్ తదితర షేర్లు ఉన్నాయి. ఈనెల 8వ తేదీ నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 1,880 కోట్ల డాలర్ల విలువైన షేర్లు లాక్‌ఇన్‌ పీరియడ్‌ పూర్తయి మార్కెట్‌లోకి రానున్నాయి.
ఈ నెలలో నెలలో లాక్-ఇన్ ఓపెనింగ్ అయ్యే కంపెనీలు ఇవి….
శ్రీ తిరుపతి బాలాజీ: లాక్-ఇన్ 30 లక్షల షేర్లు అక్టోబర్ 10న విడుదల అవుతాయి.
టోలిన్స్ టైర్స్: లాక్-ఇన్ అక్టోబర్ 14. 20 లక్షలు షేర్లు మార్కెట్‌లోకి అదనంగా వస్తాయి.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్: లాక్-ఇన్ సీరియడ్‌ అక్టోబర్ 14తో ముగుస్తుంది. ఆ రోజేన ఏకంగా 12.6 కోట్ల షేర్ల లాకిన్‌ పూర్తవుతుంది.
క్రాస్: లాక్-ఇన్ పూర్తవడంతో 30 లక్షలు షేర్లు ఈనెల 14న మార్కెట్‌లోకి వస్తాయి.
PN గాడ్గిల్ జ్యువెలర్స్: 30 లక్షల షేర్లకు 14న లాకిన్‌ పూర్తవుతుంది.
వెస్ట్రన్ క్యారియర్స్: 40 లక్షల షేర్లుఈనెల 21న విడుదల అవుతాయి.
ఆర్కేడ్ డెవలపర్లు: 50 లక్షల షేర్లకు ఈనెల 21 లాకిన్‌ పూర్తవుతుంది.
నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్: 10 లక్షల షేర్లకు 21న లాకిన్‌ పూర్తవుతుంది.
మన్బా ఫైనాన్స్: ఏకంగా 20 లక్షల షేర్లు అంటే కంపెనీ ఈక్విటీలో 4 శాతం షేర్లకు లాక్-ఇన్ ఈనెల 28న పూర్తవుతుంది.
KRN హీట్ ఎక్స్ఛేంజర్: 20 లక్షల షేర్లకు ఈనెల 31న లాకిన్‌ పూర్తవుతుంది.