For Money

Business News

9న మోడీ ప్రమాణ స్వీకారం

మూడోసారి ప్రధాన మంత్రిగా మోడీ ఈనెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.రేపు అంటే జూన్‌ 7వ తేదీన బీజేపీ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వీరు కోరనున్నారు. ఈ మేరకు వివిధ పక్షాల మద్దతు కూడిన లేఖను ఆమెకు అందించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు రేపు ఢిల్లీలో భేటీ కానున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు. 293 మంది ఎంపీల మద్దతు తమకు ఉన్నట్లు ఎన్డీఏ స్పష్టం చేసింది.